బాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతూ సత్తా చాటుతుంది కమల్ పెద్ద తనయ శృతిహాసన్. వరుస సినిమాలతో బిజీబిజీగా తన కెరీర్ ను లాగించేస్తోంది. సాధారణంగా పెళ్లి గురించి యువ హీరోయిన్లను ప్రశ్నిస్తే రకాల సమాధానాలు వినపడతాయి. ఏ ఒక్కరూ కూడా క్లారిటీ ఇవ్వరు. అయితే శృతిహాసన్ మాత్రం కుండబద్ధలు కొట్టేసింది. తనకి పెళ్లి పట్ల మంచి అభిప్రాయం ఉందని, ఒక పనిలో లాభనష్టాలున్నట్లే పెళ్లి వల్ల లాభనష్టాలుంటాయని, అయితే పెళ్లి వల్ల నష్టం కంటే లాభమే ఎక్కువని చెప్పడమే కాకుండా తాను ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది శృతి... ఎంతైనా తెలివైన పిల్ల కదా!