శృతిహాసన్ బాగా తెలివి ప్రదర్శిస్తోంది

November 10, 2015 | 02:28 PM | 3 Views
ప్రింట్ కామెంట్
sruthi-hassan-silent-on-telugu-movie-offers-niharonline

ప్రస్తుతం హాట్ బ్యూటీ శృతీహాసన్ కి ఓవైపు తెలుగులో, మరోవైపు తమిళ్ లో పిచ్చ క్రేజ్ ఉంది. ఇక అడపా దడపా బాలీవుడ్ చిత్రాలు బోనస్. దాదాపు అగ్ర కథానాయకుల అందరితోనూ సినిమాలు చేస్తున్న శృతీ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న శృతి ఇప్పుడు తెలుగు చిత్రాలకు బ్రేక్ ఇవ్వటమే పెద్ద కారణం. కానీ, తమిళంలో మాత్రం వరుసబెట్టి చిత్రాలు వస్తుంది. అసలు ఆమెకు ఇండస్ట్రీ లైఫ్ ఇచ్చిందే తెలుగు సినీ పరిశ్రమ. మరి అలాంటిది టాలీవుడ్ ను ఆమె లైట్ తీస్కుందంటే అర్థం ఏంటో అంతుబట్టడం లేదు.

తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం శ్రీమంతుడు. అది విడుదలై దాదాపు 3 నెలలు కావస్తుంది. అయితే ఏ టాప్ హీరోయిన్ అయినా సరే ఇన్ని రోజులు కాల్షీట్లు ఖాళీగా ఉంచటం అంటే మాములు విషయం కాదు. కానీ, ఆమె మాత్రం పూర్తిగా తన డేట్స్ ను తమిళ చిత్రాలకే కేటాయించి తెలుగును పక్కన పెట్టింది. పోనీ నిర్మాతలు ఎవరూ తనను సంప్రదించట్లేదా అంటే వారంతా క్యూ కట్టేస్తున్నారట. మరి అలాంటిది ఆమె ఎందుకు సైలెంట్ గా ఉంది.

ఎంతోమంది దర్శక నిర్మాతలు ఆమె కావాలని ప్రయత్నిస్తున్నారుట. అయినా ఆమె తొందరపడి ఓకే చెప్పడం లేదని సమాచారం. మహేశ్ బాబు కథానాయకుడిగా మురుగదాస్ తెరకెక్కించనున్న సినిమాకి మాత్రమే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మహేష్ కూడా ఆ సినిమా కోసం శృతీనే తీసుకోవాలని నిర్మాతలను సైతం కొరుతున్నాడట. అంటే దాదాపు 6నెలలు ఆమె ఖాళీగా ఉండాలి. ఈలోపు తమిళంలో దున్నేసుకొవచ్చునని ఆమె ఫ్లాన్. మాములుగా తెలుగులో తక్కువ చిత్రాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగేయ వచ్చు. ఈ ఫిలాసఫీని త్వరగా అర్థం చేసుకుంది శృతి. ఇలా హీరో, బ్యానర్, దర్శకుడు ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకునే శ్రుతిహాసన్ నిర్ణయం తీసుకుంటోందని తెలుస్తోంది. ఆ ప్లానింగ్ వల్లనే ఆమె ఈ స్థాయికి చేరుకుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అంతే మరి కమల్ కూతురిది మాములు తెలివి కాదండోయ్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ