సిద్ధార్థ్, దీప సన్నిధి జంటగా నటించిన సినిమా `నాలో ఒకడు`. ఎనక్కుళ్ ఒరువన్ అనే తమిళ సినిమాకు రీమేక్ ఇది. ప్రసాద్ రమర్ దర్శకుడు. ఈ సినిమాను కోనేరు కల్పన తెలుగులో విడుదల చేస్తున్నారు. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ నుండి తమిళంలోకి రీమేక్ అయి ఘనవిజయాన్ని సాధించింది. ఇదే చిత్రాన్ని తమిళం నుండి తెలుగులో డబ్ చేశారు. సినిమాపై మంచి అంచనాలు ఉండటంతో సినిమా విడుదలకు ముందే శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్టు సమాచారం. మా టీవీ వారు నాలో ఒకడు చిత్రాన్ని డెబ్బై లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారట.