అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరోగా మారిన సిద్ధార్థ్ ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. త్వరలోనే తెలుగులో ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ హీరో సింగర్ అవతారం ఎత్తాడు. తెలుగులో గతంలో పాటలు పాడిన సిద్ధార్థ్ ఈసారి తమిళంలో తన గళాన్ని సవరించాడు. తమిళ పాటల రచయిత విజయ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘స్ట్రాబెరీ’ చిత్రం కోసం సిద్ధార్థ్ పాట పాడాడు. ఈ విషయాన్ని ఆ చిత్ర సంగీత దర్శకుడు హేరీస్ జయరాజ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.