ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాధన్ రెండు రోజుల క్రితమే మరణించడం, ఈ రోజు మళ్ళీ గాయకుడు రామకృష్ణ కూడా చనిపోవడం... సినీ సంగీత అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఇద్దరూ వెంటవెంటనే వెళ్ళిపోవడం పై ప్రముఖ గాయని సునీత ఎంతో ఆవేదనకు గురయ్యారు. ఈ ఇద్దరు సంగీత ప్రముఖులు ఒకరితరువాత ఒకరుగా వెళ్ళిపోవడంపై ఆమె స్పందిస్తూ...ఇద్దరు గొప్ప వ్యక్తులను ఒకేసారిగా కోల్పోవడం బాధాకరం’ అన్నారు. నేను రామకృష్ణ గారిని సంవత్సరం క్రితం చూశాననీ.... ఇద్దరు కూడబలుక్కుని వెళ్లిపోయినట్టుందనీ, ఇద్దరూ గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారనీ, ఇది సంగీతాభిమానులకు తీరని లోటని’ అన్నారు. ‘వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నా’నన్నారు.