సిసింద్రీ సినిమా సైలెంట్ గా స్టార్టయ్యింది

December 17, 2014 | 01:29 PM | 31 Views
ప్రింట్ కామెంట్

అఖిల్ సినిమా కోసం అక్కినేని అభిమానులంతా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఇక ‘మనం’ సినిమాలో అఖిల్ ఫస్ట్ ఎంట్రీలోనే అభిమానుల ఉత్సాహం వెల్లువెత్తింది. అఖిల్ ను హీరోగా చూడ్డం కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మొత్తానికి బుధవారం లాంచ్ అయ్యింది. కుటుంబ సభ్యుల మధ్య ముహూర్తం నిర్ణయించారు. ఈ చిత్రానికి వివి వినాయిక్ దర్శకుడు కాగా, నితిన్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని నితిన్ వివరించారు. శ్రీ శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిన్న అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఈ స్క్రిప్టుని పూజలో ఉంచారు. వినాయిక్ మాట్లాడుతూ... ఫ్యాంటసీ నేపధ్యంలో సాగే ప్రేమ కథ ఇది. వెలిగొండ శ్రీనివాస్ అద్బుతమైన స్క్రిప్టు ఇచ్చారు. కోన వెంకట్ సంభాషణలు రాస్తున్నారు. అమోల్ రాధోడ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ మొదలెడతాం. అభిమానులు కోరుకునే మాస్,మసాలా అంశాలన్నీ ఇందులో ఉంటాయని అన్నారు. సడెన్ గా సింపుల్ గా ఈ సినిమా మొదలు పెట్టేయడంపై అఖిల్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయను, వివి వినాయక్ తో హీరోగా పరిచయం అవుతున్న సినిమా పూజా కార్యక్రమాలు ఇవాళ జరిగాయి. డార్లింగ్ ప్రొడ్యూసర్ నితిన్ మరియు సుధాకర్ రెడ్డికి ఆల్ ది బెస్ట్. వారితో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు ఆలస్యం అయినందుకు నన్ను క్షమించండి’ అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టాడు. వచ్చే ఏడాది వేసవి టార్గెట్ గా ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ