చెల్లెలు వివాహ వేడుకకు సల్మాన్ పయనం

May 25, 2015 | 04:26 PM | 52 Views
ప్రింట్ కామెంట్
Salman_Arpita_Ayush_niharonline

హీరో సల్లూభాయ్ చెల్లెలు వివాహం ఇటీవలే ఆయుశ్ శర్మతో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అర్పితా రిసెప్షన్ కార్యక్రమం తన అత్తవారి సొంత ప్రదేశం హిమాచల్ ప్రదేశ్ లోని మండి అనే పట్టణంలో జరుగనుందట. అయుశ్ శర్మతో అర్పిత వివాహం జరిగిన తర్వాత తొలిసారిగా అయుశ్ వాళ్లింట్లో సంప్రదాయ పద్ధతిలో ‘ధామ్’ అనే వేడుక జరపబోతున్నారు. ఇందుకు ఆయుష్ శర్మ తండ్రి గ్రామీణాభివృద్ధి మంత్రి, అనిల్ శర్మ ఈ వేడుకకు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం తమ రాష్ట్ర ప్రభుత్వం తరపున సల్మాన్ కుటుంబానికి హెలికాప్టర్ కూడా పంపించేందుకు హిమాచల్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వేడుకకు ప్రముఖ అతిథులు పదివేలకు పైగా హాజరవుతున్నట్టు తెలిసింది. ఈ ‘ధామ్’ ఆచారం ప్రకారం అతిథులంతా నేలపైనే కూర్చోని, ఆకుల్లో భోజనం చేస్తారట. ఈ వేడుకకు సల్మాన్ కుటుంబంతో పయనమవుతున్నాడట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ