తమిళ తంబిలు తల అని అభిమానంతో పిలుచుకునే అజిత్ కు మంగళవారం ఉదయం ఆపరేషన్ జరిగింది. ఆయనకు ముక్కులో కండ పెరగడంతో కొంతకాలంగా పలు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా అధిక కండను డాక్టర్ ఎం.కె.రాజశేఖర్ మంగళవారం ఆపరేషన్ చేసి తొలగించారు. మరో రెండు రోజుల్లో అజిత్ కు సంపూర్ణంగా నయమవుతుందని రాజశేఖర్ పత్రికలవారితో చెప్పారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో, తమిళంలో అజిత్ కి కూడా అంతే క్రేజ్ ఉంది.