అక్కినేని నాగార్జున ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’. ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గతంలో నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించిన ‘హలో బ్రదర్’ సూపర్ హిట్ అయితే ఇందులో మళ్ళీ అదే కాంబినేషన్ పంటజ నాగార్జున-రమ్యకృష్ణ, ఇంకో పెయిర్ లో లావణ్య త్రిపాఠి నటిస్తోంది.
ఈ చిత్రంలో కొన్ని సీన్స్ బాగాలేకపోవడం వల్ల తిరిగి రీ షూట్ చేస్తున్నట్టు ఒక టాక్ వచ్చింది. నాగార్జునకు ఈ సీన్లు సంతృప్తికరంగా లేకపోవడంతో మళ్ళీ షూట్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫోటోలు విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అయితే తాజాగా ఈ చిత్ర షూటింగ్ లోకి రమ్యకృష్ణ తిరిగి పాల్గొంది. మొన్నటి వరకు ‘బాహుబలి’ సినిమా కార్యక్రమాల్లో రమ్యకృష్ణ బిజీగా వుండటం వల్ల షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. ప్రస్తుతం ఈ చిత్ర ఒక షెడ్యూల్ చెన్నైలో జరుగుతోంది.
సోషియో ఫాంటసీ తరహాలో ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రం రూపొందనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధామోహన్ కథ-స్ర్కీన్ ప్లేను అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.