‘సోగ్గాడే చిన్ని నాయనా' పోస్టర్స్ నిన్న రిలీజ్ అయ్యాయి. ఈ పోస్టర్లు చూస్తుంటే పాత సినిమాలు కొన్ని గుర్తుకు వచ్చాయి. మరి ఇందులో కథ ఏమిటో గానీ, ఈ జంటను (నాగార్జున-రమ్యకృఫ్ణ) ఇలా మళ్ళీ తెరమీద చూస్తుంటే అప్పటి ఫ్రెష్ జంటను చూస్తున్నట్టే అనిపించింది. ఈ జంట దాదాపు 15 ఏళ్ళ క్రితం హలో బ్రదర్, ఘరానా బుల్లోడు లో నటించారు. కాకపోతే అందులో రమ్యకృష్ణ మోడరన్ డ్రెస్సుల్లో కనిపిస్తే ఇందులో చీరకట్టులో అద్భుతంగా ఉంది. ఈరోజు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల చేసారు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు పాత్రలకు రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. నాగార్జున సరసన అనసూయ మరదలి పాత్రలో నటిస్తోందని సమాచారం. సోగ్గాడే చిన్ని నాయనా షూటింగ్ పూర్తయ్యే వరకు నాన్ స్టాప్ గా సాగుతుంది. ఇందులో యంకరమ్మ అనసూయ కూడా ఓ ఎంటర్టైనింగ్ సీన్ కోసం షూటింగులో జాయిన్ అయింది అని నాగార్జున తెలిపారు. సినిమాలో నాగార్జున, అనసూయల మధ్య బావా మరదళ్ల సరసాలు, రొమాంటిక్ సీన్లు ఉంటాయని టాక్. నాగార్జునతో కలిసి ఓ పాటలో ఆమె డాన్స్ కూడా చేస్తుందట. హాట్ అండ్ సెక్సీ లేడీ, ఐటం గర్ల్ హంసా నందిని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు.