సోనాక్షి కామెంట్లు సమంజసమే...

April 03, 2015 | 02:33 PM | 54 Views
ప్రింట్ కామెంట్
sonkshi_comments_deepika_short_film_niharonline

మహిళా సాధికారత అంటూ బాలీవుడ్ నటి దీపికా పడుకొనే చేసిన షార్ట్ ఫిల్మ్ పై సోనాక్షి సిన్హా కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనం రేపు తున్నాయి. సోనాక్షి కామెంట్లపై దీపిక ఎలా స్పందిస్తుందో తెలియదు గానీ, సోషల్ నెట్వర్క్ లో మాత్రం సోనాక్షినే ఎక్కువమంది సమర్థిస్తున్నారు. మహిళా సాధికారత గురించి దీపికా ‘మై ఛాయిస్’ అనే షార్ట్ ఫిల్మ్‌ లో నటించింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈమెతోపాటు వివిధ రంగాలకు చెందిన దాదాపు 99 మంది మహిళలు ఇందులో నటించారు. మహిళా స్వేచ్ఛను తెలియజేస్తూ అందులో దీపికా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. నడుస్తున్న కాలాన్ని బట్టి మహిళా ఇలా ఉండడంలో తప్పులేదని కొన్ని అంశాలను లేవనెత్తింది. తమకు నచ్చిన విధంగా మహిళలు ఉండాలంటూ రకరకాలుగా చెప్పుకొచ్చింది. దీనిపై సోనాక్షి ఘాటుగానే స్పందించింది. మహిళా సాధికారత అంటే తమకు తోచిన రీతితో వుండటం, ఇష్టమైన దుస్తుల్ని ధరించడం, పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం కాదని కుండబద్దలు కొట్టింది. మారుమూల గ్రామాల్లో మహిళల జీవన ప్రమాణాల్ని మెరుగుపరచడం, వారిని ఆర్థికంగా శక్తివంతంగా తయారు చేయడమే అసలైన మహిళా సాధికారత అని క్లారిటీ ఇచ్చేసింది. మహిళల సాధికారత కోసం దీపిక చేసిన ప్రయత్నం, ఉద్దేశం మంచిదే అయినప్పటికీ గ్రామీణ పేద మహిళలను దృష్టిలో ఉంచుకొని ఈ షార్ట్ ఫిల్మ్‌‌ ని రూపొందిస్తే అందరికీ ఉపయోగపడేదని సోనాక్షి తెలిపింది. సోనాక్షి చెప్పిందాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నెటిజన్లు చాలా మంది సమర్థిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ