సినీ వారసురాలుగా అడుగు పెట్టిన సోనాక్షి, తనకంటూ ఓ ఐడెంటిటీని నిలబెట్టుకుంది. మొదట్లో శత్రుఙ్ఞ సిన్హ కూతురు అని ఇండస్ట్రీలో పిలిచినా, ఇప్పుడు టాప్ హీరోయిన్ సోనాక్షిగా పిలిపించుకుంటోంది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఇన్నేళ్ళ తరువాత తండ్రీ కూతుర్లు కలిసి నటించే అవకాశం వచ్చింది వీరికి. కానీ క్యారెక్టర్లు ఏమిటనే విషయం సస్పెన్స్ లో పెట్టారు కానీ తండ్రీ, కూతుళ్లుగా చేస్తున్నారనేది ఇప్పుడు తెలిసిపోయింది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అకీరా’లో సోనాక్షి ప్రధాన పాత్రలో నటిస్తోంది. అందు కోసం మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తోంది. ఇందులో సోనాక్షి తండ్రిగా శత్రుఘన్ సిన్హా నటిస్తున్నాడు. చిత్రంలో సోనాక్షి చిన్న వయసులో ఉన్నప్పడే ఫాదర్ చనిపోతాడట. అంటే శత్రు చైల్డ్ ఆర్టిస్టుతో కలసి సన్నివేశాలు ఉంటాయట. అంటే ఇద్దరూ కలిసి నటించే ఛాన్స్ లేదన్న మాటేగా... కాకపోతే... పెరిగి పెద్దయినా నాన్న మాటలు తలుచుకుంటూ ఉంటుందట సోనాక్షి.