అనీల్ కపూర్ ముద్దుల తనయ సోనమ్ కపూర్ బాలీవుడ్ కథానాయికలందరిలోకీ కొంచెం భిన్నం. ఫీల్డ్ లోకి మోడల్ గానూ, అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పరిచయమై కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అయితే తన తరువాత వచ్చిన హీరోయిన్లు చాలా మంది ఫీల్డ్ లో దూసుకుపోతున్నా కాస్త కూడా చలించకుండా తన పనేదో తాను చేసుకుపోతుంది. తన కెరీర్ లో చెప్పుకోతగ్గ సినిమాలేవీ లేవు. ఆమెకు ఫ్యాషన్ పై ఉన్నంత శ్రద్ధ, హీరోయిన్ గా ఎదగడంపైన ఉండదట. ఇదేమిటని అడిగితే, తనకు అవార్డులు, రివార్డుల మీద కోరిక లేదని, తనకు నచ్చిన క్యారెక్టర్లనే ఎంపిక చేసుకుంటానని చెబుతోంది. ఎంతో విభిన్నంగా, ఆసక్తికరంగా ఉన్న క్యారెక్టర్లనే తను ఎంపిక చేసుకుంటానంటోంది. మోడల్ గా బాగా సూటయ్యే ఈ భామ హీరోయిన్ కు కావాల్సిన హంగులేమీ లేవేమో మరి, ఈమెకు పెద్దగా ఆఫర్లు రానట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘డాలీ కీ డోలీ’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.