సోనియా అగర్వాల్ రియల్ స్టోరీ

April 08, 2015 | 04:43 PM | 151 Views
ప్రింట్ కామెంట్
sonia_agarwal_niharonline

తెలుగులో నీ ప్రేమకై, అమ్మా నాన్న ఊరెళితే సినిమాల్లో, రీసెంట్ గా టెంపర్ లో డాక్టర్ గా నటించిన సోనీ అగర్వాల్ తెలుగు వారికి సుపరిచితురాలే. తెలుగులోకి డబ్ అయిన 7జి బ్రుందావన్ కాలనీలో నటించి అప్పట్లో ఫిల్మ్ ఫేర్ అవార్డు నామినేట్ అయ్యింది. పెళ్ళయి కొన్నాళ్ళు తెరమరుగైన ఈ అమ్మడు ఇప్పుడు వచ్చిన  ఏ అవకాశాన్నీ కాదనకుండా సద్వినియోగం చేసుకుంటోంది. తెలుగులో 'తరువాత కథ' అనే సినిమాలో నటిస్తోంది సోనియా అగర్వాల్‌. ఇది ఓ రియల్‌ లైఫ్‌ స్టోరీ ఆధారంగా రూపొందనున్నట్టు తెలుస్తోంది. తమిళంలో, తెలుగులో ఒకేసారి ఈ సినిమా నిర్మితం కానుందని సమాచారం.  సెల్వరాఘవన్‌ పెళ్ళి సుకున్న నాలుగేళ్ళకే ఆయన నుంచి విడిపోయింది సోనియా అగర్వాల్‌, అతని నుంచి విడిపోయాక నటనలో జోరు పెంచింది. వైవాహిక జీవితం కొన్ని కారణాల వల్ల ఇబ్బందులకు లోనైతే ఓ మహిళ పడే ఆవేదనను ఎంతో హృద్యంగా తెరకెక్కించనున్నారట. గతంలో ఇలాంటి కథతో సినిమా తీస్తున్నట్టు వచ్చిన వార్త వల్ల ఆమె కథనే సినిమా తీస్తున్నట్టు పుకార్లు కూడా వచ్చయి. తాజా ఈ సినిమాను ఓ తమిళ దర్శకుడు తీయబోతున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ