ఎస్పీబీ కి కేరళ ప్రభుత్వ అవార్డు

April 20, 2015 | 06:06 PM | 48 Views
ప్రింట్ కామెంట్
spbalasubrahmanam_kerala_state_govt_award_niharonline

కొన్నివేల వేల పాటలతో అందరినీ అలరించి, తెలుగువాడిగా పుట్టినా ఎన్నో భాషలకు తన గానామృతాన్ని పంచుతున్నబాలసుబ్రమణ్యంకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం అవార్డును అందిస్తోంది.  అయ్యప్ప భక్తిగీతాలు ఆలపించిన బాలసుబ్రమణ్యం అయ్యప్పస్వామి కొలువైన శబరిమలై పుణ్యక్షేత్రంలో హరివరసానం అవార్డును అందుకోనున్నారు. కేరళ ప్రభుత్వం ప్రతి ఏడాది అయ్యప్పస్వామిని కీర్తిస్తూ ఆలపించిన ప్రముఖ గాయకుల్లో ఒకరిని ఎంపిక చేసి ఈ అవార్డుతో సత్కరించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం అవార్డును మన బాలసుబ్రహ్మణ్యంకు ఇవ్వనున్నారు. జూన్‌లో శబరిమలైలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. గత ఏడాది వరకు అవార్డుతోపాటు రూ.50వేలు నగదు బహుమతి అందించిన కేరళ ప్రభుత్వం ఈ ఏడాది ఈ నగదును లక్ష రూపాలయకు పెంచారు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ