బాహుబలి సినిమాలో ఓ ప్రత్యేకమైన భాషను వాడారట. అది ఆడియో వేడుక సందర్భంగా ప్రస్తావించారు. కాలకేయ మాట్లాడే ఈ ‘కిలికి’ భాష ఎలా పుట్టిందనే విషయాన్ని చెప్పొకొచ్చారు. ఈ సినిమాలోని కాలకేయ వార్ లార్డ్ కి సంబంధించిన భాష ఇది. ఈ భాషని కనిపెట్టింది ఎవరు అనే విషయానికి వస్తే తమిళ లిరిసిస్ట్ మరియు డైలాగ్ రైటర్ మధన్ కార్కీ ఈ భాషని ఇన్వెంట్ చేసాడు. మదన్ కార్కీ ఇచ్చిన రీసెంట్ ఇంటర్వ్యూలో కిలికి భాషకి సంబందించిన ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.. ‘రాజమౌళి గారు కాలకేయుల కోసం ఓ పవర్ఫుల్ మరియు మోటైన భాష కావాలన్నారు, అదికూడా వింటుంటేనే మనలో భయం కలిగేలా ఉండాలని అన్నారు. దాంతో ఈ కిలికి భాషని కనిపెట్టా. ఇందుకోసం 40 గ్రామర్ రూల్స్ తో కూడిన 750 పదాలను కనిపెట్టాం. అంతే కాకుండా షూటింగ్ స్పాట్ లో అందరూ రెఫర్ చేసుకోవడానికి కొన్ని రెఫరెన్స్ డాక్యుమెంట్స్ ని కూడా ప్రిపేర్ చేసాము. కిలికి భాషలో కొన్ని పదాలు అర్థం చేసుకోవడానికి, పలకడం కష్టంగా ఉంటుంది. అందుకే ఆ పదాలని ఎలా పలకాలి అనేది రికార్డ్ చేసి సెట్స్ కి పంపాను. ఒకటి మాత్రం చెప్పగలను కాలేకయులు ఈ భాష మాట్లాడుతుంటే వినేవాళ్లలో భయం కలుగుతుందని' అన్నాడు. బాహుబలి సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ,మలయాళ , హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అన్ని భాషల్లోనూ కిలికి భాష మత్రం కామన్ గా ఉంటుందట. కథ కోసం...నటుల కోసం... పిక్చరైజేషన్ కోసం... పాటలకోసం... ఇలా... చివరికి కిలికి భాష కోసం మనం బాహుబలి సినిమాను తప్పకుండా చూడాలి... సినిమాపై ఆసక్తిని పెంచడం కోసం ఎన్ని ట్విస్టులిస్తున్నాడో జక్కన్న మాస్టారు.