మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కొరకు ఒక వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్ గా సినీనటుడు నరేష్ ను కన్వీనర్ గా సత్యం మంచిని కో కన్వీనర్ గా నటి I.D.P. L నిర్మలను నియమించడం జరిగింది. నరేష్ అధ్యక్షతన ఆదివారం (జూన్ 21) ఉదయం పదకొండు గంటల నుండి 5 గంటల వరకు వెల్పేర్ కమిటీ ఒక హై పవర్ వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా చంద్రమౌళి I.A.S , వేణుగోపాల్ రెడ్డి(ఏకలవ్య ఫౌండేషన్ NGO), రమణారావు(C.E.O, VITAL SOFT)లు విచ్చేశారు. మా అసోసియేషన్ సెక్రటరీ శివాజీరాజా, వైస్ ప్రెసిడెంట్ శివకృష్ణ, శ్రీమతి లక్ష్మీ మంచు, కోశాధికారి పరచూరి వెంకటేశ్వరరావు ఇతర వెల్ఫేర్ కమిటీ సభ్యులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆర్ధికంగా, వ్యక్తి పరంగా వెనుకబడ్డ నటీనటుల సమస్యలు వాటికి పరిష్కారాలు గురించి చర్చించడంతో పాటు ఒక సమగ్రమైన సర్వే చేసి అర్హులైన వారిని గుర్తించడం అవసరమని పెర్కొనడం జరిగింది. ఒక కంప్యూటరైజ్ డ్ సాఫ్ట్ వేర్ చేసి సర్వేను స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహిస్తామని నరేష్ పెర్కొన్నారు. వెల్ఫేర్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ కళాకారుల సంక్షేమానికి మూవీ ఆర్టిస్ట్ ఆసోసియేషన్ ముందుంటుందని అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలియజేశారు.