తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో అడపాదడపా నటించినా అంతగా క్లిక్ కాని నటి శ్రద్ధా దాస్. ‘ఆర్య2’, ‘డార్లింగ్’, ‘నాగవల్లి’, ‘మొగుడు’ సైడ్ హీరోయిన్ గా నటించింది రేయ్ చిత్రంలో విలన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకూ చెప్పుకో తగిన గొప్ప పాత్రలేవీ ఈమెకు రాలేదనే చెప్పాలి. దీంతో అందాల ప్రదర్శన మొదలు పెట్టింది. అయినా కూడా మంచి హిట్ అమ్మడికి రాలేదు. కానీ బాలీవుడ్ లో ఓ ఛాన్స్ కొట్టేసింది. ‘జిద్’ అనే సినిమాలో నటించింది. ఇందులో తన అందాల్ని ఓ రేంజ్ లో చూపించేసిందట. ఎంత చూపించినా... అక్కడ కూడా పెద్దగా ఆఫర్లు రావడం లేదు ఈ అమ్మడికి చివరికి బాలీవుడ్ లోనే మరో ఆఫర్ వచ్చింది. సచిన్ జోషి హీరో కాగా, ప్రవాల్ రామన్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా టైటిల్ ‘హంటింగ్ ఆఫ్ బాంబే మిల్స్’. శ్రద్ధా దాస్ ఈ సినిమా గురించి చెపుతూ... ఇదొక హర్రర్ సినిమా. ఇందులో తాను ఓ జర్నలిస్ట్ పాత్రలో నటించనున్నానని తెలిపింది. ఈ చిత్ర షూటింగ్ ఈనెల 24 నుంచి పోలాండ్ లోని క్రాకౌ ప్రాంతంలో ప్రారంభం అవుతుందట. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారట. జర్నలిస్టు పాత్రలో నైనా చూపించకుండా నటించే ఛాన్స్ వస్తుందో లేదా శ్రద్ధా దాస్ కు.