బోనీకపూర్, శ్రీదేవిల కూతురు జాహ్నవి సినిమాలకు ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో నని ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. ఆమె ఫలానా హీరోతో, ఫలానా డైరెక్టర్ తో సినిమా చేస్తోందని అప్పుడప్పుడూ పుకార్లు షికారు చేస్తున్నా.... శ్రీదేవి మాత్రం తన కూతురి ఎంట్రీ విషయం ఇంతవరకూ బయట పెట్టలేదు. తన కూతుర్ని హీరోయిన్ని చేయాలనే కోరిక ఉన్నప్పటికీ బయటికి మాత్రం ఏమీ మాట్లాడ్డం లేదు.ఆ మధ్య. కరణ్ జోహార్ ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఆమె కూతురితో సినిమా చేయడానికి పకడ్బందీగా ఆలోచిస్తోన్నట్టు తెలుస్తోంది. జాహ్నవి మాత్రం అప్పుడప్పుడూ సెక్సీ డ్రెస్సులతో సినిమా పార్టీల్లో వెలిగిపోతూ కనిపిస్తోంది. హీరోయిన్ కావడానికి కావాల్సిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయని చూపిస్తోంది. ఆమె పబ్లిక్‌లోకి వచ్చినపుడు తన లుక్స్ గురించి చాలా శ్రద్ధ వహిస్తుంది. జాహ్నవి స్టయిల్స్, ఆమె ధరించే దుస్తులు చాలా క్రేజీగా ఉంటున్నాయి. ఇక తల్లి పోలికలు కాస్త వచ్చాయి కాబట్టి శ్రీదేవి తొలి నాళ్ళలో ఉన్నట్టు కాస్త బొద్దుగా కనిపిస్తోంది. శ్రీదేవి ప్లాన్స్ ఏమిటో.... తనతో తీయబోయే సినిమా ఏంటో వేచి చూడాల్సిందే.