సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి. స్టార్ నిర్మాత, స్టార్ హీరోయిన్ కూతురు జాహ్నవి ఎప్పటి నుంచో సినిమాల్లోకి వస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకూ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. ఆ మధ్య అఖిల్ తో ఓ సినిమా చేయబోతుందని వదంతులు కూడా వచ్చాయి. ఇక షారూఖ్ కొడుకుతో ప్రేమాయణం నడిపిస్తుందంటూ మరో వదంతు వ్యాపించింది. ఇప్పుడు మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమా చేయబోతుందంటూ మరో వార్త బయటికి వచ్చింది. అయితే ఈ సినిమాకకు దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అంటున్నారు. ఎప్పటినుంచో కూతుర్ని వెండితెరకు పరిచయం చేయాలని వెయిట్ చేస్తున్న శ్రీదేవికి విజయేంద్ర ప్రసాద్ ఓ కథ వినిపించాడట. అయితే హీరో దుల్కర్ సల్మాన్ అయితే బాగుంటుందని అభిప్రాయాన్ని కూడా శ్రీదేవి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆయన కథలు రాయడంలో దిట్ట అందులో దర్శకత్వంలోనూ ప్రవేశం ఉండడంతో శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాను తెలుగు, తమిళ మళయాళ భాషల్లో ఒకేసారిగా తెరకెక్కించేలా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికైనా జాహ్నవి ఎంట్రీ ఖరారైనట్టేనా? అఫీషియల్ వార్తల కోసం ఎదురు చూద్దాం...