మళ్ళీ ‘మదర్’గా రూప్ కీ రాణి

March 17, 2015 | 05:32 PM | 49 Views
ప్రింట్ కామెంట్
sridevi_mother_niharonline

ఈ అతిలోక సుందరి అమ్మ పాత్రలోకి దిగిపోయింది. ఒకప్పటి అతిలోక సుందరి కాబట్టి, ఇప్పుడు ఈవిడ అమ్మ పాత్రల్ని కూడా హైలైట్ చేసి మరీ సినిమాలు తీయడానికి సిద్ధమై పోతున్నారు. రియల్ లైఫ్ తల్లి పాత్రలో తలమునలైపోయి, ఇప్పుడు అంటే  20 ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆ మూవీ భారీ విజయం అందుకోవడంతో ఈమెకు ఎన్నో మూవీ ఆఫర్లు వచ్చాయి. కానీ ప్రతి సినిమాకూ ఓకే అనెయ్యకుండా ఆచీ తూచీ అడుగులు వేస్తూ తన ఒకప్పటి ఇమేజ్ కు డామేజ్ కలుగకుండా కాపాడుకుంటూ వస్తోంది. ఆ దిశగానే పావులు కదుపుతోంది. ప్రస్తుతం శ్రీదేవి తమిళంలో విజయ్ హీరోగా రూపొందుతున్న ‘పులి’ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తోంది. ఇప్పుడు ఈమె మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం! మనసుకు హత్తుకునే మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న ఈ సినిమాకి ‘మదర్’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమాలో శ్రీదేవి డాటర్ గా ఓ కొత్త హీరోయిన్ కనిపించనుంది. ఈమె కోసం యూనిట్ గాలింపు మొదలు పెట్టింది. గతంలో పలు విజయవంతమైన వాణిజ్య ప్రకటనలు చేసిన రవి వడయార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీదేవి భర్త, బాలీవుడ్ ఫేమస్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఈ సినిమాని నిర్మించనున్నాడు. ఈ సినిమాని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్నారు. ఇక తదుపరి విషయాలు వారి యూనిట్ సభ్యుల ద్వారానే విందాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ