అనగాని ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎ.వి వి దుర్గాప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి ‘మెంటల్ పోలీస్’ అనే టైటిట్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి కరణం బాబ్జీ దర్శకత్వం వహిస్తుండగా శ్రీకాంత్, అక్షలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆపరేషన్ దుర్యోదన క్యారెక్టర్ కన్నా భిన్నమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇందులో నటిస్తున్నట్టు హీరో శ్రీకాంత్ తెలిపారు. అన్యాయాలను అరాచకాలను సహించలేని పోలీసు ఆఫీసర్ గా ఇందులో కనిపిస్తానని ఈ చిత్రం తొలి షెడ్యూల్ ఇప్పటికే విజయవాడలో పూర్తి చేశామని, రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుందని చెప్పారు. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన సినిమాలు రెండూ కలిపినట్టుగా ఉంటుందనీ, ఇది ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని అన్నారు. శ్రీకాంత్ కు ఖడ్గం, ఆపరేషన్ ధుర్యోదన తరువాత వచ్చే మంచి యాక్షన్ మూవీగా మెంటల్ పోలీస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది