కమల్ గారాల పట్టి శృతి ముంబయిలో మెట్రోలో తిరిగిందట... నమ్మకంగా అనిపించడం లేదు కదా... ఇదేమిటి పబ్లిక్ ఊరుకుంటుందా? సెలబ్రిటీలు ఇంత ఫ్రీగా ట్రైన్ లో తిరుగుతుంటే అనుకుంటాం... అయినా ఆమెకు బోలెడు ఏసీ కార్లు ఉండే ఉంటాయి కదా... మెట్రో రైలు ఎక్కే అవసరం ఏమొచ్చిందంటారు...? దీనికి కారణం ట్రాఫిక్ సమస్య అని అంటోంది శ్రుతి. ముంబై మహానగరంలో ట్రాఫిక్ సమస్య చాలా ఘోరంగా ఉంటుందని, దాన్నుంచి తప్పించుకోడానికి ఆమె మెట్రో రైలు ఎక్కిందట. ఆ ప్రయాణం చాలా బాగుందని గురువారం సోషల్ నెట్వర్క్ లో షేర్ చేసుకుంది. తాజాగా శ్రుతిహాసన్ నవరతన్ కూల్ టాల్కం పౌడర్ ప్రకటనలో కూడా పాల్గొన్నదట. ఆ ఫొటోను కూడా ట్వీట్ చేసింది.
శ్రుతిహాసన్ 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమాలో అక్షయ్ కుమార్ సరసన నటించింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలీ, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ కలిసి నిర్మించారు. 2002లో విడుదలైన రమణ అనే తమిళ సినిమాకు ఇది రీమేక్ గా తీశారు.