‘ఆంధ్రాపోరి’ ఆడియో ఆవిష్కరణ

May 08, 2015 | 11:43 AM | 64 Views
ప్రింట్ కామెంట్
Andhra_Pori_Audio_launch_niharonline

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి, ఉల్కాగుప్తా హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఆంధ్రాపోరి’. రమేష్‌ ప్రసాద్‌ నిర్మాత. రాజ్‌ మాదిరాజ్‌ దర్శకుడు. జోశ్యభట్ల సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది.

థియేట్రికల్‌ ట్రైలర్‌ను విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ ఆవిష్కరించారు.

ఆడియో సీడీలను శేఖర్‌ కమ్ముల ఆవిష్కరించి తొలి సీడీని ప్రకాష్‌రాజ్‌కి అందించారు.

ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది.

చిత్ర నిర్మాత రమేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘మా నాన్నగారు అఖరి శ్వాస వరకు ఇండస్ట్రీకి సేవచేశారు. ఆయన ఆరవై సినిమాలను డైరెక్ట్‌ చేశారు. మా బ్యానర్‌లో వస్తున్న 30వ సినిమా. ఇప్పటి వరకు సినిమా ప్రాసెసింగ్‌లో 18సార్లు మా ల్యాబ్‌కి  నేషనల్‌ అవార్డ్‌ వచ్చింది. ఐమ్యాక్స్‌ అనేది నా ఆలోచనే. రాజ్‌ మాదిరాజ్‌ మా బ్యానర్‌లో రెండో సినిమా చేస్తున్నాడు. తన కోసమే ఈ సినిమా చేస్తున్నాను. తన సిన్సియారిటీ నచ్చి చేస్తున్న సినిమా. టీమ్‌ అందరూ బాగా కష్టపడ్డారు. ఈ సినిమా చేయడం చాలా శాటిస్పాక్షన్‌ ఇచ్చింది. ఎందుకంటే ఈ సినిమా చేయడం ద్వారా నాకు మా నాన్నగారు గుర్తుకు వచ్చారు. ఈ బ్యానర్‌లో మంచి సినిమాలు చేస్తానని, ఈ బ్యానర్‌ను కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను. ఆకాష్‌, ఉల్కాగుప్తా చక్కగా నటించారు. పూరిగారికి థాంక్స్‌. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’అన్నారు.

ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడుతూ ‘‘పూరితో నాకున్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. నిర్మాత రమేష్‌ ప్రసాద్‌, డైరెక్టర్‌ రాజ్‌ మాదిరాజ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ జోశ్యభట్లకు అభినందనలు. ఈ సినిమా మరాఠీలో చరిత్రను తిరగరాసింది. ఈ సబ్జెక్ట్‌తో ఆకాష్‌ పరిచయం కావడం ఎంతో ఆనందంగా ఉంది. కచ్చితంగా సినిమా పెద్ద హిట్టవుతుంది. ఉల్కాలో క్యూట్‌నెస్‌, ఇన్నోసెన్స్‌ నాక నచ్చింది. ధోని చిత్రాన్ని తనతో చేయాలని పూరిని అడిగ్గానే ఒప్పుకున్నాడు.  ఆకాష్‌ కళ్లల్లో వెంటనే పెద్దైపోయి సినిమాల్లో చేయాలని ఆరాటపడేతత్వం కనపడిరది. కెమెరా ముందు రావాలనే ఆకలి చూసి నన్ను ఇంప్రెస్‌ అయ్యాను. సంస్కారముంది,వినయుముంది. అలాగే తనకి నచ్చినట్లే చేస్తాడు. తనలో ఏదో ఒక తపన ఉంది. పూరి ఎక్కడా తన నీడ పడకుండా ఆకాష్‌ని పెంచాడు. మేం తెలుగు సినిమాని ఎంత ప్రేమించామో అంతగా అడుగుతున్నాను ఆకాష్‌ని ఆశీర్వదించండి’’ అన్నారు.

ఆకాష్‌ పూరి మాట్లాడుతూ ‘‘నాకు చిన్నప్పట్నుంచి హీరో కావాలనే ఉండేది. పదహారేళ్లుగా హీరో కావాలని ఎదురుచూస్తున్నాను. ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో సినిమా చేయడం నా అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన రమేష్‌ ప్రసాద్‌గారికి థాంక్స్‌. ఉల్కాగుప్తా నాకు బెస్ట్‌ కాంపిటీషన్‌ ఇచ్చాను. ఉత్తేజ్‌గారుతెలంగాణా నేర్పిండంతో పాటు చాలా విషయాలు నేర్పారు. అరవింద్‌గారు ఉల్కాగుప్తా అన్నయ్యగా నటించడం ఆనందంగా ఉంది. జోశ్యభట్లగారు అద్భుతమైన మ్యూజిక్‌  ఇచ్చారు. శ్రీముఖిగారు ఇందులో మ్యూజిక్‌ టీచర్‌గా నటించారు. నా రియల్‌ ఫ్రెండ్సే ఇందులో నా ఫ్రెండ్స్‌గా నటించారు. మా నాన్నగారి ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇద్దామనుకున్నాను. ఈ సినిమా చేయాలనుకోలేదు. కానీ రాజ్‌గారు నాన్నగారితో మాట్లాడిన తర్వాత టైమ్‌పాస్‌ సినిమా చూడమని నాన్నగారు అన్నారు. సరేనని చూసిన తర్వాత, రాజ్‌గారి నేరేషన్‌ విన్న తర్వాత ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని ఎదురుచూశాను. నాకు సినిమాలంటే చాలా ఇష్టం. నాకు సినిమాలు తప్ప వేరే దిక్కు లేదు. మా నాన్నగారు ఇక్కడకి రాలేదు. ఆయన లేని లోటును ప్రకాష్‌రాజ్‌గారు తీర్చేశారు. మా నాన్నగారు నాకు ఇంత మంచి ఫ్లాట్‌ ఫామ్‌ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్‌ తీసుకుని మా నాన్నగారి సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ అవుతాను. ‘నాన్న మూడేళ్ల తర్వాత నన్ను హీరోగా ఇంట్రడ్యూస్‌ చేయండి చాలు ఇక ఏమీ అడగను’. ఆడియెన్స్‌కి చెప్పేదొకటే నా పేరు ఆకాష్‌పూరి నన్ను కాస్తా గుర్తు పెట్టుకోండి..మళ్లీ వస్తాను’’ అన్నారు.

మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘టైటిల్‌ వింటేనే చాలా సరాదాగా ఉంది. నిర్మాత రమేష్‌ ప్రసాద్‌గారు మంచి మిత్రులు. ఈ టీమ్‌ పెద్ద సక్సెస్‌ను అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

డైరెక్టర్‌ రాజ్‌ మాదిరాజ్‌ మాట్లాడుతూ ‘‘ ఈ టైటిల్‌ను ఎవరిని కించపరచడానికి పెట్టుకున్న టైటిల్‌ కాదు. ఒక తెలంగాణా అబ్బాయి తనను అమితంగా ప్రేమించిన ఆంధ్రా అమ్మాయిని ముద్దుగా పిలుచుకునే పేరు అది. దానికి అనవసరమైన రాద్ధాంతం చేయవద్దు. కలెక్షన్స్‌ కోసం ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌కి ఇలా చేయాల్సిన అవసరం లేదు’’ అన్నారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ జోశ్యభట్ల మాట్లాడుతూ ‘‘మాతృకలోని ఆత్మ చనిపోకుండా ఒక కంచెను ఏర్పాటు చేసి అందులో నాకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చి డైరెక్టర్‌ రాజ్‌ మాదిరాజ్‌గారు సంగీతాన్ని రాబట్టుకున్నారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు, సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్‌’’ అన్నారు.

ఉల్కాగుప్తా మాట్లాడుతూ ‘‘నేను తెలుగులో 72వ హీరోయిన్‌గా ఎంట్రీ అవుతున్నానని చెప్పారు. ఫ్యూచర్‌లో కచ్చితంగా 72 సినిమాలు చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్‌’’ అన్నారు.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘‘డైరెక్టర్‌ రాజ్‌ మాదిరాజ్‌గారు మిష్టర్‌ కూల్‌. మంచి బావుకత ఉన్న వ్యక్తి. జోశ్యభట్ల మంచి ట్యూన్స్‌ ఇచ్చారు. ఆకాష్‌, ఉల్కా సహా ప్రతి ఒక్కరికి ఈ చిత్రంతో మంచి బ్రేక్‌ రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో... విజయేంద్రప్రసాద్‌, హ్యపీడేస్‌ వంశీ, కృష్ణ మదినేని, బి.వి.ఎస్‌.రవి, నందు, సుద్ధాల అశోక్‌ తేజ, చక్రవర్తులు, డైరెక్టర్‌ రాహుల్‌, సుధాకర్‌ కొమ్మినేని, బిజెపి ఎమ్మెల్సీ రామచంద్ర, అభిజీత్‌, శ్రీముఖి, శేఖర్‌ కమ్ముల తదితరులు హాజరై ఆడియో, సినిమా పెద్ద హిట్‌ కావాలని చిత్రయూనిట్‌ను అభినందించారు.

పూర్ణిమ, ఈశ్వరిరావు, అరవింద్‌ కృష్ణ, శ్రీముఖి, ఉత్తేజ్‌, అభినయ, శ్రీ తేజ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌: మహేష్‌ చదలవాడ, సంగీతం: జోశ్యభట్ల, ఆర్ట్‌: రాజీవ్‌ నాయర్‌, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌ వనమాలి, డ్యాన్స్‌: చంద్రకిరణ్‌, పాటలు: సుద్ధాల అశోక్‌ తేజ,రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగాడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల, నిర్మాత: రమేష్‌ ప్రసాద్‌, దర్శకుడు: రాజ్‌ మాదిరాజ్‌.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ