టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి, ఉల్కాగుప్తా హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం‘ఆంధ్రాపోరి’. రమేష్ ప్రసాద్ నిర్మాత. రాజ్ మాదిరాజ్ దర్శకుడు. ఇటీవల ఆడియో విడుదలై మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ పొందిందని సమాచారం. టీనేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రాన్ని జూన్ 5న విడుదల చేయాలనుకుని చిత్రయూనిట్ భావిస్తోందట. అధికారకంగా సమాచారం రావాల్సి ఉంది.