శ్రీమంతుడు సినిమా విడుదల తేదీ దగ్గరవుతున్న కొద్దీ ఈ సినిమా గురించి ఆతృత ఎక్కువ కనిపిస్తోంది. దీని ప్రమోషన్ కోసం ఈ చిత్రం బృందం ఇంటర్వ్యూలతో హోరెత్తిస్తుంటే, ఇది చాలదన్నట్టు ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు ఒక్కొక్కరినే దించేస్తున్నారు. శ్రీమంతుడి సినిమా కోసం వాళ్లు ఎంత ఆతృతగా ఉన్నారో చెప్పిస్తున్నారు.
మహేష్ కు మరపురాని సినిమాలందించిన పూరి జగన్నాథ్ శ్రీమంతుడు గురించి తనదైన శైలిలో మాట్లాడాడు. ‘‘నేను ఎప్పుడె ప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా శ్రీమంతుడు. ఎందుకంటే ఇది మా కృష్ణగారబ్బాయి... మా మహేష్ బాబు నటించిన సినిమా. మహేష్ సినిమా కోసం నేనే కాదు.. అందరూ ఇలాగే ఎదురు చూస్తారు. మహేష్ డైరెక్టర్లకు కిక్కిచ్చే హీరో. మమ్మల్ని ఇన్ స్పైర్ చేస్తుంటాడు. నా ఫ్రెండు కొరటాల శివ.. మహేష్ తో పని చేయడం నాకు చాలా సంతోషం. శివ ఎప్పుడు కలిసినా మహేష్ బాబు గురించే మాట్లాడుతుంటాడు. శ్రీమంతుడు పెద్ద హిట్టవ్వాలని కోరు కుంటున్నా. నా డార్లింగ్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో ఒక పాట చేశాడు. ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే నా మొగుడు.. అని. నేను కూడా ఆ మొగుడి కోసమే ఎదురు చూస్తున్నా’’ అని ముగించాడు. మరోవైపు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం శ్రీమంతుడి కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. శ్రీమంతుడు చాలా పెద్ద హిట్టవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఇంకా మరి కొందరు స్టార్ డైరెక్టర్లతో కూడా సినిమాను ప్రమోట్ చేయించే ఉద్దేశంతో ఉన్నారట ప్రొడ్యూసర్లు. ఆ లిస్టులో త్రివిక్రమ్, శ్రీనువైట్ల, గుణశేఖర్ లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ స్టార్ డైరెక్టర్లు బాహుబలి గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఎందుకని?