ఎంతో వైభవంగా ఉత్సాహంగా జరిగిన మంచు మనోజ్ - ప్రణీత వివాహానికి సినీ ప్రముఖులు కొందరు కనిపించకపోవడం విశేషం. పలు రాష్ట్రాల గవర్నర్లు సూపర్‌స్టార్ రజనీకాంత్, అంబరీష్ తదితరులు వేడుకకు హాజరు కాగా, కొన్ని స్టార్ కుటుంబాల నుండి ఎవరూ అటెండ్ కాకపోవడం పై పలువురికి చర్చనీయాంశమైంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లో పవన్ ఒక్కరు మాత్రమే అటెండ్ అయ్యారు. ఇక అక్కినేని ఫ్యామిలీ, రామానాయుడు ఫ్యామిలీ నుంచి ఎవరూ ఈ పెళ్ళికి రాకపోవడం వల్ల మాట్లాడుకోడానికి ఇదొక టాపిక్ గా మారింది. ఏ ఈవెంట్ లోనూ తన హాజరు వేయించుకునే నాగచైతన్య, రానాలు కూడా పెళ్ళికి రాలేదు. మోహన్‌బాబు కు సమకాలీకులు బాలకృష్ణ తప్ప చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్ లు ఇక్కడ కనిపించకపోవడం లోటుగా నే అనిపించింది. జయసుధ, జయప్రద, సుమలత, రవీనా టాండన్, త్రిష తదితర సౌత్ స్టార్స్ సంగీత్ వేడుకకు అటెండ్ అయినా ఈ వేడుకకు శ్రీదేవి రాలేదు. మంచు హీరోలతో పలు సినిమాల్లో నటించిన హీరోయిన్లు కూడా ఈ వేడుకకు హాజరు కాలేదు. స్టార్ హీరోలంటే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లు మాత్రం పెళ్ళిలో తళుక్కుమన్నారు.