‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ రిలీజ్ కు ముందే ఈ చిత్రం హిట్ అవుతుందని సినిమా అభిమానులు అంచనా వేశారు. ఎందుకంటే గబ్బర్ సింగ్ లాంటి హిట్స్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్, సినిమాల హిట్స్ ను అంచనా వేసే డిస్ట్రిబ్యూటర్ కం నిర్మాత ఈ చిత్రానికి నిర్మాత కావడంతో ఈ సినిమాలో విషయం ఉంటుందనే అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని 700 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్ లో 150 థియేటర్లలో రిలీజ్ చేశారు. మొదటి రోజు సుబ్రమణ్యం ఫర్ సేల్ 4.08 కోట్లు వసూలు చేసింది. ఇది రెండవ రోజుకు 8.5 కోట్లకు చేరుకుంది. కేవలం ఏపి - తెలంగాణలో వచ్చిన వసూళ్లు ఇవి. సాయిధరమ్ నటించిన మూడు సినిమాల కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు. సుబ్రహ్మణ్యం జోరు చూస్తుంటే మొదటి వారమే బ్రేక్ ఈవెన్ సాధించేయడం ఖాయం అని అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని 12 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అంటే భలే భలే మగాడి చిత్రంలాగానే మొదటి వారంలోనే పెట్టబడి పూర్తిగా రాబట్టే చిత్రం అవుతుందనుకుంటున్నారు.