మహేశ్ బాబు తనకి మళ్లీ ఛాన్స్ ఇస్తే చాలనీ .. ఆయనకి హిట్ ఇస్తానని దర్శకుడు సుకుమార్ అన్నాడు. తాజాగా నాన్నకు ప్రేమతో ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించాడు. గతంలో సుకుమార్ - మహేశ్ బాబు కాంబినేషన్లో ' 1 నేనొక్కడినే' సినిమా వచ్చింది. ఈ సినిమా మహేశ్ తో పాటు ఆయన అభిమానులను ఎంతగానో నిరాశ పరిచింది.
ఈ సినిమాను గురించి సుకుమార్ ప్రస్తావించాడు. '1 నేనొక్కడినే' సినిమా విషయంలో మహేశ్ బాబు - నిర్మాతలు తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారనీ, అలాంటిది ఆ సినిమా పరాజయం పాలవడం తనకి ఎంతో బాధ కలిగించిందని సుకుమార్ చెప్పాడు. టెక్నికల్ గా ఈ సినిమా ఒక వర్గం వారిని ఆకట్టుకున్నా, సాధారణ ప్రేక్షకులను చేరుకోలేకపోయిందని అన్నాడు. అందువలన మహేశ్ బాబు తనకి మరో అవకాశం ఇస్తే, తప్పకుండా హిట్ ఇస్తాననే నమ్మకంతో వున్నానని సుకుమార్ చెప్పాడు. మరి ఆయనకి మహేశ్ మళ్లీ ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి. అయితే నాన్నకు ప్రేమతో కు వస్తున్న పాజిటివ్ టాక్ నేపథ్యంలో అదేం పెద్ద కష్టం కాదని అనుకోవచ్చు.