సినిమా హీరోయిన్ల కోసం వెతుకులాటతో పాటు, టైటిళ్ళ బెడద కూడా బాగానే ఉన్నట్టుంది సినీ ఇండస్ట్రీకి. టైటిల్ అదంటూ... ఇదంటూ... కొన్నాళ్లు సినిమాకు ప్రమోట్ చేసుకోవడం, చివరికి టైటిల్ అనౌన్స్ చేయడం ప్రతి సినిమాకు నడుస్తున్న ట్రెండ్. మూడక్షరాల టైటిళ్ళకు బ్రేక్ ఇచ్చి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తరువాత పెద్ద టైటిళ్ళ ట్రెండ్ మొదలైంది. ‘అత్తారింటికి దారేది’ సినిమా టైటిల్ ఇచ్చాక అభిమానులు ఇది పవర్ స్టార్ టైటిల్ లా లేదనుకున్నారు. కానీ ఆ సినిమా క్లిక్ అయ్యింది. ఇప్పుడు త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషనల్ వస్తున్న సినిమాకు టైటిల్ విషయంలో చాన్నాళ్ళ నుంచి తర్జనబర్జన జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అర్జున్ కు జులాయి టైపులో ఉంటే బాగుంటుందని, హుషారు, జాదూగర్ అనుకున్నారు. అవేవీ కాదని త్రివిక్రమ్ ఈ సినిమా టైటిల్ ను ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ అని ఫైనల్ చేశారట. ఇలా కొత్త టైటిల్ కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడట త్రివిక్రమ్. ఫైనల్ గా దీన్నే రిజిస్టర్ చేయడానికి డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.