దాదాపు రెండేళ్లుగా సైలెంట్ గా ఉన్న సునీల్ రెచ్చిపోతున్నాడు. తాజాగా సునీల్ హీరోగా మరో సినిమా మొదలు కానుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభమవుతుంది. మళ్లీమళ్లీ ఇది రాని రోజు సినిమా తర్వాత క్రాంతి మాధవ్ చేస్తున్న సినిమా ఇదే. సంతోషం సగం బలం అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. పరుచూరి ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. సునీల్ ప్రస్తుతం ఆర్.పి.ఎ. క్రియేషన్స్ పతాకంపై వంశీ ఆకెళ్ల దర్శకత్వంలో సుదర్శన్‌రెడ్డి నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమాకు అగ్గిపుల్ల అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు దిల్‌రాజు బ్యానర్‌లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే.