కొత్త సంవత్సర వేడుకలలో భాగ్యనగరవాసులకు మజా పంచేందుకు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ సిద్ధమయ్యింది. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ జూబ్లీహిల్స్ లోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్ లో డిసెంబర్ 31 న అర్థరాత్రి ముగింపు వేడుకలకు సన్నీ తో స్పెషల్ డాన్స్ షో ను ఏర్పాటు చేయించింది. ఇందుకుగానూ సదరు కంపెనీ సన్నీకి రూ. 5 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుందంట. అయినా న్యూ ఇయర్ వేడుకలతో పేరుతో సెలబ్రిటీలు దండుకోవడం మాములే లేండి. గతేడాది చెన్నైలో నిర్వహించిన కొత్త సంవత్సర వేడుకలకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కేవలం 20 నిమిషాల ప్రదర్శనకు రూ.6 కోట్లు తీసుకోని షాక్ కి గురిచేసింది. అదే విధంగా కొందరు నటీనటులు తమ స్థాయికి తగట్టు డిమాండ్ చేస్తూ జనాల్ని ఎంటర్ టైన్ చేస్తుంటారు. అసలే చలితో వణికిపోతున్న హైదరాబాద్ వాసులకు ఈ యేడు ఆఖరి రోజున స్పెషల్ డాన్స్ షోతో సన్నీ సెగలు పుట్టిస్తుందన్నమాట.