ఒక జర్నలిస్టుగా ప్రయాణం మొదలు పెట్టి కొండేటి సురేష్ అటు తరువాత పంపిణీ దారునిగా, సంతోషం పత్రిక అధినేతగా ప్రతి సంవత్సరం సంతోషంపేరిట సినిమా అవార్డులు ప్రదానం చేస్తున్నాడు. అతి కొద్ది సమయంలోనే నిర్మాతగా మారి ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జర్నీ, పిజ్జా వంటి పదకొండు చిత్రాలు విడుదల చేసి సక్సెస్ సాధించాడు. ప్రేక్షకులకు మంచి చిత్రాలు అందించే నిర్మాతగా సురేష్ కొండేటి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడాయన మరో సూపర్ డూపర్ హిట్ మూవీని ప్రేక్షకులకు అందించనున్నారు. ఆ సినిమా పేరు 'ఉస్తాద్ హోటల్'. మలయాళంలో ఘనవిజయం సాధించిన చిత్రం ఇది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా అన్వర్ రషీద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విమర్శకుల ప్రసశంసలు సైతం అందుకున్న చిత్రం ఇది. ఈ చిత్రవిశేషాలను సురేష్ కొండేటి తెలియజేస్తూ - "ఇప్పటివరకూ దుల్కర్, నిత్యామీనన్ మూడు చిత్రాల్లో జంటగా నటించారు. 'ఉస్తాద్ హోటల్'. ఈ చిత్రంలో దుల్కర్, నిత్యా జోడీ బాగుందని ప్రేక్షకులు కితాబులిచ్చారు. ఆ తర్వాత చేసిన 'ఓకే బంగారం' ద్వారా హిట్ పెయిఅనిపించుకున్నారు. ఇక, ఇటీవల ఈ జంట నటించిన ఘనవిజయం సాధించింది. 'ఉస్తాద్ హోటల్' గురించి చెప్పాలంటే.. మూడు జాతీయ అవార్డులు గెల్చుకుంది. 'బెస్ట్ పాపులర్ మూవీ', 'బెస్ట్ డైలాగ్స్', నటుడు తిలకన్ కి ప్రత్యేక అవార్డు లభించాయి. అవార్డులు మాత్రమే కాదు.. భారీ వసూళ్లు సాధించి, మంచి కమర్షియల్ మూవీ అనిపించుకుంది. లవ్, సెంటిమెంట్, పేద, ధనిక వర్గాల మధ్య ఉండే భేదం.. తదితర అంశాల సమాహారంతో రూపొందిన చిత్రం ఇది. ఈ చిత్రం హక్కులు దక్కినందుకు ఆనందంగా ఉంది. వచ్చే నెల ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.