కాక్క కాక్క(తెలుగులో ఘర్షణ), నువ్వు నేను ప్రేమ చిత్రాల్లో సందడి చేసిన సూర్య, జ్యోతిక ద్వయం తర్వాత పెళ్లి చేసుకుని దంపతులయ్యారు. తర్వాత జ్యోతిక సినిమాలకు దూరమైంది. దాదాపు ఎమిదేళ్ల తర్వాత ‘36 వయదినిలే’ చిత్రంతో జ్యోతిక ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ కొట్టింది. అయితే తాజా సమాచారం ప్రకారం వీరిద్దరి కాంబినేషన్ లో ఇద్దరు దర్శకులు రెండు స్క్రిప్ట్స్ ను రెడీ చేస్తున్నారట. మంచి స్క్రిప్ట్ కుదిరితే వీరిద్దరు కలిసి నటిస్తారట.