సూర్య హీరోగా ప్రముఖ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘24’ అనే చిత్రం తీస్తున్న విషయం అందిరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో సినిమా వాళ్ళలో టైటిల్ విషయంలో, సినీ తారలు సినిమా చేయనని తప్పుకోవడంలో, బయ్యర్ల గొడవ, హిందూ, ముస్లిముల గొడవలు కేసులు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి.... ఇంతవరకూ ఆ రాష్ట్రాల సినిమా వాళ్ళ మధ్య ఉన్న వివాదాలు, ఇప్పుడు పొరుగు రాష్ట్రాల వరకూ వచ్చేసింది. ప్రస్తుతం సూర్య 24 టైటిల్ వివాదం తెచ్చిపెట్టింది. ఏకంగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఈ టైటిల్ విషయంపై చాలా సీరియస్ గా వున్నారు. ఇదే విషయంపై అనిల్ కపూర్ స్పందిస్తూ... ఇదే ‘24’ టైటిల్ ను తాను రిజిస్టర్ చేయించుకున్నానని... దీనిపై సర్వహక్కులు తనకే వున్నాయంటూ చెబుతున్నాడు. అయితే ఈ విషయంపై ముందుగా సూర్య మరియు ఆ చిత్ర యూనిట్ తో తాను మాట్లాడతానని... ఒకవేళ వాళ్లు మాట వినకపోతే లీగల్ నోటీసులు తప్పవని స్పష్టం చేసాడు.