సూర్య పేరు మీద సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పలువురు రెగ్యులర్ పోస్ట్ లు చేస్తుంటారు. అలాంటివారి గురించి సూర్య తన ట్విట్టర్ లో కామెంట్ చేశారు. అంత టైమ్ స్పెండ్ చేసి చేస్తున్నందుకు అభినందించారు. సూర్య ముంబైలో తీయించుకున్న ఫ్యామిలీ ఫోటోను పోస్ట్ చేసిన ఓ వ్యక్తిని ఉద్దేశించి ఎలా సంపాదించగలిగారు? అంటూ ఆశ్యర్యాన్ని కూడా వ్యక్తం చేశారు. తన అభిమానులకు దగ్గర కావడానికి ఇటీవల సూర్య ట్విట్టర్ లో అకౌంట్ ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. తాను నిర్మిస్తున్న 36వయదినిలే సినిమాకు సంబంధించిన తొలి పోస్టర్ ను మహిళా దినోత్సవం రోజు ట్విట్టర్ ముఖతా ఆయన విడుదల చేసిన సంగతి కూడా పాఠకులకు పరిచితమే.