ఒకప్పుడు గ్లామర్ పాత్రల నటే అయినప్పటికీ, సూర్యను పెళ్ళి చేసుకుని గ్రుహిణిగా మారిపోయి, పిల్లల పాలన పోషణలతో అచ్చమైన భారతీయ వనితగా నూరు మార్కులు కొట్టేసింది జ్యోతిక. ఈమె పెళ్ళి తరువాత సూర్య నిర్మాణ కత్వంలో 36 వయదినిలే అనే సినిమాతో తిరిగి సిల్వర్ స్క్రీన్పై కనిపించి అభిమానులను అలరించింది. అయితే ఈ సినిమా ఇప్పుడు సూర్య తెలుగులోకి ‘రావమ్మా మహాలక్ష్మి’ టైటిల్ తో అనువదిస్తున్నాడు. ఇది జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. మళయాళంలో హౌ ఓల్డ్ ఆర్ యూ కు దర్శకత్వం వహించిన రోషన్ ఆన్డ్రూస్ తమిళ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. హీరో సూర్య 2 డి ఎంటర్ టైన్ మెంట్ బేనర్లో నిర్మించారు. తెలుగులోనూ జ్యోతిక-సూర్యలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ డబ్బింగ్ సినిమాను చూసేందుకూ అందునా జ్యోతిక ఇన్నేళ్ళ తరువాత తెరమీద కనిపిస్తుందన్న ఎంగ్జైటీతో ఈ సినిమా చూడ్డానికి రెడీ అవుతున్నారు.