ప్రధాన మంద్రి నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ కు అపూర్వ స్పందన వచ్చింది. దేశంలోని ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా స్వీకరించి తమ వంతు గాఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్గా సినీ నటి, నిర్మాత లక్ష్మి మంచు ఎంపికయింది. సెప్టెంబర్ 10న రాష్ట్రపతి భవన్లో ఆమెకు ఈ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మిమంచు మాట్లాడుతూ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు అందుకొని, నా స్థాయిలో నేను ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం మరింత బాధ్యతను పెంచినట్టయింది.. రాష్్టపతి చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే తెలంగాణ రాష్ర్టాన్ని స్వచ్చ తెలంగాణగా మార్చడానికి నా వంతు కృషి చేస్తాను. ఇంతటి బాధ్యతను నాకు అప్పగించిన ప్రధాని మోదీకి నా కృష్ణతలు’’ అని చెప్పారు.