2014లో ఓ సెక్స్ స్కాండల్ లో చిక్కుకున్న శ్వేతాబసుకు ఓ మూవీ ఛాన్స్ వచ్చిందటండీ... ఈ కేసులో ఆధారాలు లేవంటూ కోర్టు కేసు కొట్టివేశారు. తిరిగి సినిమాలో నటించాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది శ్వేతాబసు. ఆమె ముద్దాయిగా ఉన్నప్పుడు తాము అవకాశాలిస్తామంటూ ముందుకు వచ్చిన పెద్దలంతా గమ్మున ఉండిపోయారు. పాపం ఇక అవకాశాలు రావేమో అన్న నిరాశకు గురైంది శ్వేత. అయితే... చివరకు హారర్ థ్రిల్లర్ మూవీలో నటించబోతోంది శ్వేత. ఇది తెలుగు మూవీ కాదు. మరాఠీ, బెంగాలీల్లో ద్విభాషా చిత్రంగా రూపొందిస్తున్నారు. అమిత్ ఖన్నా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా...ఎక్కువ భాగం షూటింగ్ నాశిక్, కోల్కతా ప్రాంతాల్లో జరగనుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న శ్వేత.. ప్రస్తుతం రూట్స్ పేరుతో... క్లాసికల్ మ్యూజిక్ పై అనురాగ్ కశ్యప్ కు చెందిన ఫాంటం ఫిలిమ్స్ తీస్తున్న డాక్యుమెంటరీలోనూ నటిస్తోంది. ఈ సినిమాతోనైనా శ్వేతకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుందాం...