ఇటీవలి కాలంలో వార్తల్లో కెక్కిన బెంగాలి నటి శ్వేతా బసు ప్రసాద్ కి తాజాగా అవకాశం తలుపు తట్టినట్లు సమాచారం. బాలీ వుడ్ లో అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గా పేరున్న హన్సల్ మెహతా తెరకెక్కించనున్న డాక్యుమెంటరీలో శ్వేతాకు అవకాశం కల్పించాడు. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఆధారంగా డాక్యుమెంటరీ రూపొందనుంది. ఆమె కేసులో చిక్కుకుని అరెస్టయి రెస్క్యూ హోమ్ లో వున్న సందర్భంలోనే హన్సల్ ఈమెకి మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన విధంగానే ఆమెని సినిమాలోకి తీసుకున్నాడు. అటు కొంత కాలంగా కెరీర్ పరంగా ఫుల్ డిస్టర్బ్ గా ఉన్న శ్వేతా కూడా ఈయన ఇచ్చిన ఆఫర్ కి సంతోషంగా వెంటనే ఓకే చెప్పింది.