తెలుగు సినిమా ‘కొత్త బంగారు లోకంలో’ అమాయకంగా కనిపించి అందరినీ ఆకట్టుకున్న శ్వేత బసు ఇటీవలే వార్తల్లో కెక్కిన విషయం తెలిసిందే. సక్సు రాకెట్ లో చిక్కుకున్న ఆమె రెస్క్యూ హోంలో కొద్ది రోజులు గడిపిన అనంతరం కోర్టు ఆమెకు క్లియరెన్స్ ఇచ్చి విడుదల చేసింది. మసకబారిన తన సినీ కెరియర్ పై తిరిగి దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించిన శ్వేత, తొలిసారి కన్నడ సినిమాలో ఓ ఛాన్స్ దక్కించుకుంది. ‘దేవ్రావ్నే బుడు గురు’ అనే కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందట. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా మంచి రోల్ ఈమెకు దొరికిందట. ఇక ఈమె సరసన కన్నడ బిగ్బాస్ విన్నర్ అకుల్ బాలాజీ నటిస్తున్నాడని సమాచారం. శ్వేత ఈ సినిమాతో మరిన్ని అవకాశాలు అందుకుని సినీ కెరీర్ ను తిరిగి ప్రారంభించాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ శ్వేతా...