తెలుపులోనే అందముంటుందా?

April 06, 2015 | 03:36 PM | 44 Views
ప్రింట్ కామెంట్
shweta_tiwari_BIG_B_4_winner_niharonline

ఇప్పుడు సినిమా హీరోయిన్లను తెల్లగా ఉన్న వారినే ఇష్టపడుతున్నారనీ, వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని... తెల్లగా ఉంటేనే అందమనే భావన భారతీయుల్లో మారాలని బాలీవుడ్ నటి శ్వేతా తివారి అంటోంది.  బిగ్ బాస్-4 రియాల్టీ షో లో ఈమె విజేత అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...‘సినిమాలు చూసే మన ప్రేక్షకులు కేవలం తెల్లగా ఉండే హీరోయిన్లను మాత్రమే ఇష్టపడుతున్నారు. కాస్త నలుపుగా ఉండే హీరోయిన్లను వారు అందగత్తె కింద పరిగణించడం లేదు. ప్రేక్షకుల్లో ఇలాంటి మైండ్ మారాలి' అన్నారు. నల్లగా ఉన్నా,  చామన ఛాయగా ఉన్నా మెరిసిపోయే చర్మంతో కనుముక్కుతీరు తీర్చినట్టుగా ఉంటే చాలా  ఆకట్టుకుంటారనీ, కానీ రంగు తక్కువగా ఉన్న ఎంత అందమైన వారయినా వారిని అందగత్తెలుగా భారతీయులు పరిగణించడం లేదని నిరాశ వ్యక్తం చేసారు. సినిమాల్లో మంచి ఆత్మసౌందర్యం ఉన్న వారిని చాలా ప్రత్యేకంగా చూస్తారు. కానీ బయట అలా ఉన్నప్పటికీ రంగు తక్కువగా ఉన్న వారిని మాత్రం అభిమానించడం లేదు, ఆదరించడం లేదని ఆమె బాధను వ్యక్తం చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ