వైభవంగా తాగుబోతు రమేష్ పెళ్ళి

May 29, 2015 | 05:23 PM | 25 Views
ప్రింట్ కామెంట్
Thagubotu_Ramesh_Weds_Swathy_niharonline

పక్కన తాగుబోతు పెట్టకుండా న్యూస్ రాయడం చాలా కష్టంగా ఉంది. పెళ్ళి రోజైనా కాస్త డిగ్నిటీగా రాద్దామంటే కుదరడం లేదు రమేష్... నీ హార్ ఆన్ లైన్ తరఫున హాపీ మారీడ్ లైఫ్.... రమేష్ రామిల్ల స్వాతి మెళ్ళో మూడు ముళ్ళు వేసి తన బేచ్లర్ లైఫ్ కు ముగింపు పలికారు. నిజామాబాద్ జిల్లా, బిక్కనూరుకు చెందిన గోసు సత్యనారాయణ కూతురితో గురువారం 8.22 గంటలకు కామారెడ్డిలోని వరలక్ష్మి గార్డెన్ లో రమేష్ పెళ్ళి జరిగిపోయింది. ఈ పెళ్ళికి దాదాపు సినీ హాస్య నటులు చాలా మంది హాజరయ్యారు. ధన్ రాజ్, వేణు, ప్రవీణ్ తదితరులు రమేష్ దంపతులకు విషెస్ తెలిపారు. తిరిగి శనివారం  రమేష్ సినీ ప్రముఖులందరినీ ఆహ్వానించి జూబిలీ హిల్స్  లోని దాసపల్ల హోటల్ లో  (30 మే) రిసెప్షన్ పార్టీ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోనున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ