తమన్నా తెలుగు ఇండస్ట్రీలో అందరితోనూ మంచి స్నేహభావంతో మెలుగుతూ.... హీరోయిన్ ని అన్న దర్పం ప్రదర్శించకుండా అడ్జెస్ట్ అయిపోతోంది. ఎథిక్స్, వాల్యూస్ బాగా ఫాలో అయిపోయినట్టు కనిపిస్తుంది. ఈ మధ్య విడుదలైన బాహుబలితో తమన్నా రేంజి మరింత పెరిగిందనే చెప్పాలి. హీరోయిన్లు ఒక వైపు సినిమాల ద్వారా సంపాదిస్తూ, మరో వైపు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తుంటారు. హీరోయిన్ తమన్నా... సినిమా రంగంలోకి అడుగు పెట్టక ముందు నుండే మోడలింగ్, యాడ్ ఫిల్మ్స్ చేయడం మొదలు పెట్టింది. తను ఖజానా జువెలెరీ కంపెనీకి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా పని చేసింది. అంతకు ముందు ఆమె పెయిర్నెస్ క్రీమ్ యాడ్స్ లో కూడా నటించింది. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి యాడ్స్ ఛస్తే చేయనని తెగేసి చెపుతోంది. తనకు ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ యాడ్స్ మాత్రం చేయనంటోంది. ప్రస్తుతం నేను నటిగా సమాజం పట్ల ఒక బాధ్యతగల స్థానంలో ఉన్నాను. శరీర రంగు అనేది దేవుడు ఇచ్చింది. తెల్లగా ఉండే వారు ఎక్కువ, నల్లగా ఉండే వారు తక్కువ తేడా ఉండకూడదు. అందుకే ఇలాంటి యాడ్స్ చేయకూడదని నిర్ణయించుకున్నాను. మనిషి గుణం, ప్రవర్తన బట్టే గుర్తింపు ఉండాలి కానీ, ఇలా శరీర రంగును బట్టి కాదు అని అంటోంది తమన్నా. కంగన రనౌత్ కూడా ఇదే అభిప్రాయంతో ఓ ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ రెండు కోట్లు ఇస్తానన్నా తిరస్కరించింది. ఇప్పుడు తమన్నా కూడా అదే బాటలో నడుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె తెలుగులో మూడు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అందులో ఒకటి రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘బెంగాల్ టైగర్' చిత్రం కాగా, మరొకటి నాగార్జున-కార్తి మల్టీస్టారర్ మూవీ ‘ఊపిరి'. మరో రెండు షూటింగ్ కు రెడీ అవుతున్నాయి.