‘పులి’ చిత్రంతో బిజీగా ఉన్న విజయ్ తన నెక్స్ ట్ మూవీ రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. రాధికా శరత్ కుమార్ ఇందులో కీలకపాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశారు. అందులో భాగంగా చైనాలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి లోకేషన్స్ వేట స్టార్ట్ చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి విడులైన ‘ఐ’ చిత్రాన్ని కూడా చైనాలో చిత్రీకరించారు. మొత్తం మీద అట్లీ శంకర్ ను ఫాలో అవుతున్నాడని ఫిలింవర్గాలు అంటున్నాయి. ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్థం తర్వాత సెట్స్ లోకి వెళ్లనుంది.