ఉదయనిధి స్టాలిన్`నయనతార జంటగా నటించగా ఘన విజయం సాధింంచిన తమిళ చిత్రం ‘ఇదు కదిరివేలన్ కాదల్’ తెలుగులో ‘శీనుగాడి లవ్‌స్టోరి’ పేరుతో అనువాదమవుతుండడం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో.. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. జూన్ 5న విడుదల కానుంది. హారిస్ జైరాజ్ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ పాటలన్నీ వనమాలి రాసారు. ఈ చిత్రం ఆడియో ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అత్యంత సందడిగా విడుదలైంది. ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ ‘శీనుగాడి లవ్‌స్టోరి’ బిగ్ సీడిని లాంచ్ చేయగా.. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఆడియోను ఆవిష్కరించి.. తొలి ప్రతిని హీరో శ్రీకాంత్‌కు అందజేసారు. ‘సోని మ్యూజిక్’ ద్వారా ఈ ఆడియో మార్కెట్‌లో లభ్యం కానుంది. ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త మరియు తెలుగుదేశం నాయకులు అంబికా కృష్ణ ధియేటర్ ట్రైలర్‌ను రిలీజ్ చేసారు. హీరో ఆకాష్, ప్రముఖ నటుడు ధనరాజ్, ప్రముఖ నిర్మాతలు ప్రతాని రామకృష్ణగౌడ్, సత్యారెడ్డి, సి.వి.రావు, ముత్యాల రాందాస్,వర్ధమాన యువ కథానాయకి సోని చరిష్టా, నటుడు` నిర్మాత మలినేని లక్ష్మయ్యచౌదరి, ఎన్నారై కొమ్మిడి శ్రీనివాస్‌రెడ్డి తదితరులతోపాటు చిత్ర బృందం పెద్ద సంఖ్యలో పాల్గొంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘శీనుగాడి లవ్‌స్టోరి’తెలుగులో అంతకంటే పెద్ద విజయం సాధించాలని అతిధులంతా ఆకాంక్షించారు. హారిస్ జైరాజ్ సంగీతం, సంతానం కామెడి, నయనతార గ్లామర్ ‘శీనుగాడి లవ్‌స్టోరి’ చిత్రానికి ప్రధాన ఆకర్షణలని వారు పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ... ‘శీనుగాడి లవ్‌స్టోరి’ని తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం ఇచ్చిన హీరో మరియు తమిళ వెర్షన్ ప్రొడ్యూసర్ ఉదయనిధి స్టాలిన్‌తోపాటు.. కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని జూన్ 5న విడుదల చేయనున్నామని ప్రకటించారు.
డా॥భరత్‌రెడ్డి, శరణ్య, సంతానం, ఛాయాసింగ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎడిటింగ్: శివ వై.ప్రసాద్, పబ్లిసిటీ డిజైనర్: వెంకట్.యం, సినిమాటోగ్రఫి: బాలసుబ్రమణియం, సాహిత్యం: వనమాలి, సంగీతం: హేరిస్ జైరాజ్, సమర్పణ: ఉదయనిధి స్టాలిన్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ`స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: యస్.ఆర్.ప్రభాకరన్.