సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న యువ నటుడు

November 20, 2015 | 11:38 AM | 5 Views
ప్రింట్ కామెంట్
maya_hero_aari_secret_marriage_niharonline

మరో హీరో సీక్రెట్ గా ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే అది పెద్దలను ఒప్పించే సుమండీ. కోలీవుడ్ కు చెందిన యువ నటుడు ఆరి ప్రేమ వివాహం జరిగింది. శ్రీలంకకు చెందిన నదియతో ఆరి గత మూడేళ్లుగా ప్రేమాయణం నడిపాడు. బీఏ పట్టభద్రురాలైన నదియ లండన్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తుంది. అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. తాజాగా వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలిసిపోవటం, వారి పెళ్లికి అంగీకరించడంతో లైన్ క్లియర్ అయ్యింది. బుధవారం ఉదయం చెన్నయ్ లోని ఒక ఆలయంలో గుట్టుచప్పుడు కాకుండా వారి వివాహం జరిగింది.

అయితే చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో మాత్రం రిసెప్షన్ ఇచ్చాడట. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సినీ ప్రముఖులు మాత్రమే ఆ వేడుకకు హాజరయ్యారు. కాగా, ప్రఖ్యాత దర్శకులు బాలచందర్, భారతీరాజా ముఖ్యపాత్రలు పోషించిన 'రెట్టచుళి' చిత్రం ద్వారా ఆరి హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత మాలై పొళుదు మయక్కత్తిలే, ధరణి, నెడుంశాలై తదితర చిత్రాలతో గుర్తింపు పొందాడు. ఇటీవల నయనతార నటించిన 'మాయ' చిత్రంలో హీరోగా ఆరి మనందరికీ పరిచయమే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ