విజయ్ ‘కత్తి’ సినిమా తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు ఆ మధ్య బాగా వార్తలు వచ్చాయి. ఇందులో హీరోగా ఎన్టీఆర్ ను తీసుకుంటారనీ... కాదు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నట్టు గాసిప్స్ చెలరేగిపోయాయి. కానీ ఈ సినిమా తెలుగులో చేయడానికి ఇద్దరు హీరోలూ వెనకడుగు వేశారట. మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'కత్తి' సినిమాకు తెలుగులో తీయడానికి కాపీ రైట్స్ సమస్య ఉందని ఆగిపోయినట్టు తెలుస్తోంది. మన తెలుగులో సాహసం చేయని ఈ సినిమాను హిందీలో సల్మాన్ ఖాన్ తో తెరకెక్కించబోతున్నారు. సల్మాన్ కు సౌత్ సినిమా ల రీమేక్ ల్లో నటించడం ఇష్టమని అంతకుముందే చాలా సార్లు చెప్పాడు. అందుకే కత్తి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతకు ముందే సల్మాన్ ఖాన్ మురుగదాస్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అది కత్తి సినిమానే అని అనుకంటున్నారు. అప్పట్లోనే ఆయనతో ఈ సినిమా చేయడానికి అంగీకారం తీసుకోడానికి వెళ్ళాడట. కానీ అప్పుడు కోర్టు కేసు నడుస్తుండడంతో మురుగదాస్ వెనకడుగు వేశాడట. ఈ చిత్రాన్ని అతుల్ అగ్ని హోత్రి నిరిమస్తున్నారట. అయితే ఈ చిత్రం కథ తమదే అంటూ ఇరువురు కేసులు వేయడం తెలిసిందే. అందులో ఒకరు తిరువల్లూరు కి చెందిన మింజూర్ అయితే... మరొకరు అన్బువ రాజశేఖర్ కావడం విశేషం.