ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమాలు పైరసీ బారిన పడితే ఆ నిర్మాతల బాధ వర్దీనాతీతం. ఈ పైరసీ బారిన పడకుండా బాహుబలి పైరసీకారులపై దండయాత్ర ప్రారంభించింది. సైబర్ వార్ కి తెరలేపారు. స్పెషల్ కోడ్, వాటర్ మార్క్, ఎవరైనా కాపీ చేయాలని చూస్తే పట్టించేసే టెక్నాలజీని ఉపయోగించాం అంటూ వార్ మొదలు పెట్టారు. ఇలా పైరీ యుద్ధం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది అయినా పైరసీ బారిన ఎన్నో సినిమాలు పడుతూనే ఉన్నాయి. అలా పాపనాశం కూడా పైరీ బారిన పడింది, కమల్ –గౌతమి నటించిన పాపనాశం తమిళంలో సూపర్ హిట్ చేశారు. కానీ పాపనాశం రిలీజైన మూడో రోజే ఆన్ లైన్ లో టొరెంట్ల రూపంలో పైరసీ అందుబాటులోకి వచ్చేసింది. అసలు దీన్ని ఎవరు అప్ లోడ్ చేశారు? అన్నది కూడా కనుక్కోలేని పరిస్థతి. దీనిపై దర్శకుడు జీతూ జోసెఫ్ మాట్లాడుతూ ఇప్పటికే పైరసీ కంట్రోల్ సెల్కి అర్జీ పెట్టకున్నాం. పోలీస్ సాయంతో వెతుకుతున్నారు. ఎవరు దొరికినా జైలుకు వెళ్ళాల్సిందే అంటున్నారు. వీరి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.