ఇదే ఫిక్స్: రోజా హీరో చరణ్ విలన్

October 12, 2015 | 04:12 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Arvind-Swamy-charan-niharonline

రాంచరణ్ బ్రూస్ లీ చిత్రం తరువాత ‘తని ఒరువన్’ అనే తమిళ రీమేక్ చిత్రానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్ లో చాలా మంది పేర్లు వినిపించాయి. మొదట నాగార్జున ఈ క్యారెక్టర్ లో నటిస్తున్నాడని, తరువాత తమిళ హీరో మాధవన్ పేరు కూడా వినిపించింది. ఇప్పుడు ఆ సినిమాలో నటించిన అరవింద్ స్వామి మన తెలుగులోనూ విలన్ గా నటిస్తున్నట్టు మరో తాజా వార్త వినిపిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రీమేక్‌కు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. హీరో రామ్ చరణ్, నిర్మాత డీవీవీ దానయ్యలతో కలిసి సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ డిస్కషన్స్‌తో బిజీగా ఉన్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తెలుగులో కొన్ని మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అసలైన కథను మాత్రం ఏ మాత్రం మారదని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ